ఇండియన్ సినిమాలలో కొన్నేళ్లుగా ఎన్నో దారుణమైన మార్పులు చోటు చేసుకున్నాయి. హద్దులు మీరుతున్న రొమాన్స్, బెడ్ రూమ్ సన్నివేశాలు, అక్రమ సంబంధాలు, పేరెంట్స్ మాటలకు విలువ లేనితనం.. ఇలా చాలా విషయాలపై ఎవరు నోరు మెదపడం లేదు. అలాంటి సన్నివేశాలు, కథలు.. సమాజంపై, ముఖ్యంగా యూత్ పై, పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఎవరు బయటికి ప్రశ్నించడం లేదు. సినిమాలలో అంటే.. సెన్సార్ ఉంది. కానీ.. ఓటిటి సినిమాలు, సిరీస్ లకు సెన్సార్ లేకపోవడంతో విచ్చలవిడి తనంగా శృంగారం, ఇంటిమేట్ సీన్స్ తీసి చూపిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు శివకృష్ణ ఓ వెబ్ సిరీస్ పై అసహనం వ్యక్తం చేశారు.