ఇండియన్ సినిమాలలో కొన్నేళ్లుగా ఎన్నో దారుణమైన మార్పులు చోటు చేసుకున్నాయి. హద్దులు మీరుతున్న రొమాన్స్, బెడ్ రూమ్ సన్నివేశాలు, అక్రమ సంబంధాలు, పేరెంట్స్ మాటలకు విలువ లేనితనం.. ఇలా చాలా విషయాలపై ఎవరు నోరు మెదపడం లేదు. అలాంటి సన్నివేశాలు, కథలు.. సమాజంపై, ముఖ్యంగా యూత్ పై, పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఎవరు బయటికి ప్రశ్నించడం లేదు. సినిమాలలో అంటే.. సెన్సార్ ఉంది. కానీ.. ఓటిటి సినిమాలు, సిరీస్ లకు సెన్సార్ లేకపోవడంతో విచ్చలవిడి తనంగా శృంగారం, ఇంటిమేట్ సీన్స్ తీసి చూపిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు శివకృష్ణ ఓ వెబ్ సిరీస్ పై అసహనం వ్యక్తం చేశారు.
ఇండియన్ సినిమాలలో కొన్నేళ్లుగా ఎన్నో దారుణమైన మార్పులు చోటు చేసుకున్నాయి. హద్దులు మీరుతున్న రొమాన్స్, బెడ్ రూమ్ సన్నివేశాలు, అక్రమ సంబంధాలు, పేరెంట్స్ మాటలకు విలువ లేనితనం.. ఇలా చాలా విషయాలపై ఎవరు నోరు మెదపడం లేదు. అలాంటి సన్నివేశాలు, కథలు.. సమాజంపై, ముఖ్యంగా యూత్ పై, పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఎవరు బయటికి ప్రశ్నించడం లేదు. సరే సినిమాలలో అంటే.. సెన్సార్ ఉంది.. ఎంత హద్దులు మీరినా రొమాన్స్ వరకే ఆగిపోతుంది అనుకోవచ్చు. కానీ.. ఓటిటి సినిమాలు, సిరీస్ లకు సెన్సార్ లేకపోవడంతో విచ్చలవిడి తనంగా శృంగారం, ఇంటిమేట్ సీన్స్ తీసి చూపిస్తున్నారు.
ఎవరెన్ని అనుకున్నా.. ఓటిటిలలో అడల్ట్ కంటెంట్ పెరిగిపోయింది అనేది వాస్తవం. సెన్సార్ లేక వెబ్ సిరీస్ లలో దారుణమైన సన్నివేశాలు పెడుతూ.. నోటికి ఇష్టం వచ్చినట్లుగా క్యారెక్టర్స్ తో బూతులు మాట్లాడించేస్తున్నారు మేకర్స్. ఈ విషయంపై చాలామంది రియాక్ట్ అయినప్పటికీ.. ఓటిటిల నుండి పెద్దగా రియాక్షన్ అయితే రాలేదు. వెరసి కొత్తగా మరెన్నో బోల్డ్, 18+ వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లో చేరిపోయారు సీనియర్ తెలుగు నటుడు శివకృష్ణ. ఓటిటిలో సినిమాలు, సిరీస్ లు చూద్దామంటే.. విచ్చలవిడిగా సె*క్స్ సన్నివేశాలు, బూతులు ఎక్కువ అయిపోయాయని అసహనం వ్యక్తం చేశారు.
శివకృష్ణ రీసెంట్ గా చూసిన పేరు చెప్పలేదు. కానీ.. చెప్పిన మాటల ప్రకారం.. ఈజీగా రానా నాయుడు సిరీస్ గురించే మాట్లాడుతున్నారని అంటున్నారు నెటిజన్స్. ఈ క్రమంలో శివకృష్ణ మాట్లాడుతూ.. “రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ చూశాను. మరీ దారుణంగా ఉంది. ఆల్ మోస్ట్ అది ఓ బ్లూ ఫిల్మ్ అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో నేను ఇంత దారుణమైన వెబ్ సిరీస్ చూడలేదు. భార్యభర్తలు పడుకోవడానికి బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్ రూమ్ తలుపులు తీసి ఉంచితే, పిల్లలు చూడటం అనేది మన సాంప్రదాయమేనా.. దేశం ఆర్థికంగా పతనమైతే తిరిగి కోలుకుంటుంది. కానీ.. కల్చర్ పరంగా పతనమైతే దేశాన్ని కాపాడటం కష్టమవుతుంది. చాలామంది పిల్లలు పాడైపోవడానికి కారణం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు. ఓటిటిలకు కూడా ఖచ్చితంగా సెన్సార్ ఉండాలి.” అని మండిపడ్డారు. ప్రస్తుతం నటుడు శివకృష్ణ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. సో.. ఓటిటిలో కనిపిస్తున్న అభ్యంతరకర సీన్స్ పై, ఓటిటిలకు సెన్సార్ లేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.