షణ్ముఖ్ ష్యాన్స్ కి సరయు వార్నింగ్.. దమ్ముంటే రండి..!

sarayu shannu

తెలుగు బుల్లితెరపై హల్చల్ చేస్తున్న బిగ్ బాస్ 5 తెలుగు ప్రారంభమై హోరాహోరిగా సాగుతోంది. ఇక మొదటి వారంలో ని ఎలిమినేట్ లో భాగంగా 7 ఆర్ట్స్ సరయు ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. దీంతో షో నుంచి బయటకు వచ్చాక షణ్ముఖ, సిరీ ఆట తీరుపై సరయు సంచనల వ్యాఖ్యలు చేసింది. దమ్ముంటే మగాడిలా ఆడాలని లేదంటే గాలులేసుకుని కూర్చోవాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఒక్కసారిగా షణ్ముఖ్ ఫ్యాన్స్ కోపాద్రిక్తులయ్యారు.

ఇక ఇంతటితో ఆగకుండా ఏకంగా సరయుకి ఫోన్ చేసి తిడుతున్నారని ఆమె తాజాగా ఓ వీడియోలో తెలిపింది. ఇదే కాకుండా నాపై షణ్ముక్ ఫ్యాన్స్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ తెలిపింది. ఇలా నాపై మాట్లాడే టైమ్ ఉంది కానీ, సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై మాట్లాడే సమయం లేదా అంటూ షణ్ముఖ్ ఫ్యాన్స్ పై సరయు విరుచుకుపడింది. దీంతో పాటు నేను సైదాబాద్ ఆరేళ్ల బాలిక కుటుంబానికి పరామర్శించటానికి వెళ్తున్నానని..మీకు దమ్ముంటే అక్కడికి వచ్చి వారి కుటుంబానికి సపోర్ట్ చేయాలంటూ సవాల్ విసిరింది.

ఆ తర్వాత మీకు చెతనైతే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత నన్ను అటాక్ చేయండి అంటూ 7 ఆర్ట్స్ సరయు తెలిపింది. నాకు ఎంతబాధ అనిపిస్తే అలా మాటలు అంటానో నాకు తెలుసని, బిగ్ బాస్ లో జరిగిన అసలు విషయాలను టెలికాస్ట్ చేయలేదన్నారు. ఇక సరయు షణ్ముఖ్ ఫ్యాన్స్ కి విసిరిన సవాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.