మాఫియా ప‌ప్పులంద‌రూ ఆర్య‌న్ ఖాన్ కి సపోర్ట్.. హృతిక్ రోష‌న్ పోస్ట్‌పై కంగనా సెటైర్లు!

బాలీవుడ్ లో సంచలన నటి కంగనా రౌనత్ కి హృతిక్ రోషన్ కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. ఇక డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్ పట్టుబడిన విషయం తెలిసందే. ఆర్యన్ సహా 8మందికి ఎన్సీబీ కస్టడీ ముగియడంతో..14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది కోర్టు.

raogah minఈ నేపథ్యంలో బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఆర్యన్‌ ఖాన్‌. ఇప్పటికే ఆర్యన్ కి పలువురు బాలీవుడ్ తారలు సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆర్యన్ కి సపోర్ట్ గా నిలుస్తూ బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఆర్యన్ కి సెలబ్రెటీలు మద్దతు ఇవ్వడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా కంగనా రనౌత్ తన సోషల్ మీడియాలో హృతిక్ పోస్ట్ కి స్పందిస్తూ.. ఇపుడు మాఫియా ప‌ప్పులంద‌రూ ఆర్య‌న్ ఖాన్ కు ర‌క్షణ‌గా వ‌స్తున్నారు. మేము త‌ప్పులు చేస్తాం కానీ వాటిని కీర్తించ‌కూడదు.

gasdg minఇది అత‌ని దృక్ప‌థాన్ని చెప్తూ..అత‌డు చేస్తున్న చ‌ర్య‌ల‌ ప‌ర్యావ‌సాల‌ను అత‌నికి తెలియ‌జేస్తుంద‌ని నేను న‌మ్ముతున్నా. అది అత‌న్ని మ‌రింత మంచిగా, గొప్ప‌గా ఉండేలా చేయ‌గ‌ల‌దు. ఎవ‌రైనా బ‌ల‌హీనమైపోయిన‌పుడు వారి గురించి పుకార్లు చేయ‌క‌పోవ‌డం మంచిది కానీ ఏ త‌ప్పు చేయ‌లేద‌ని వారికి అనిపించ‌డం నేర‌ం.. తప్పు చేసిన వారికి సపోర్ట్ చేయడం మరో పెద్ద నేరం అంటూ హృతిక్ రోషన్ పై పరోక్షంగా సెటైర్లు వేసింది కంగనా.