తల్లి కాబోతున్న కాజల్‌.. అందుకే ఆ సినిమా నుంచి తప్పుకుంది!?

Telugu Actress Kajal Agarwal Pregnancy - Suman TV

దాదాపు దశాబ్దకాలానికి పైగా టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు కాజల్‌ అగర్వాల్‌. వయసు పెరుగుతున్న కొద్ది కాజల్‌ అందం మరింత పెరుగుతుందని ఆమె అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. తెలుగు, తమిళ్‌, హిందీ సినిమాల్లో నటిస్తూ చేతి నిండా సినిమాలు ఉండగానే గౌతమ్‌ కీచ్లూ అనే వ్యాపారవేత్తను కాజల్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా భర్త సపోర్టుతో పెద్దపెద్ద సినిమాల్లో నటించేందుకు సైన్‌ చేశారు.

Telugu Actress Kajal Agarwal Pregnancy - Suman TVఅందులో మెగాస్టార్‌ చిరంజీవి అప్‌కమింగ్‌ మూవీ ఆచార్య ఒకటి. అలాగే కింగ్‌ నాగార్జున ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందనున్న ‘ది హోస్ట్‌’ మూవీలో నాగార్జునకు జోడీగా నటించేందుకు అంగీకరించారు. ఆ సినిమాలో ‘రా ఏజెంట్‌’గా చేయనున్న కాజల్‌ పాత్ర డిమాండ్‌ మేరకు మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా చేర్చుకున్నారని టాక్‌. కాగా తాజా సమాచారం ప్రకారం కాజల్‌ ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో కాజల్‌ ప్రెగ్నెంట్‌ అవ్వడంతోనే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై కాజల్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.