ఢీ-13 టైటిల్ విన్నర్ అనౌన్స్ మెంట్ వీడియో లీక్!

Dhee 13 Kings vs Queens Winner Kavya - Suman TV

దక్షణాదిలో అతిపెద్ద డాన్స్ షో అంటే ఢీ డ్యాన్స్ షో పేరే వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ డాన్స్ షో 12 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు కింగ్స్ vs క్వీన్స్ థీమ్ తో 13వ సీజన్ రన్ అవుతోంది. ఇక సీజన్ మొత్తం అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్న ఢీ-13 ఇప్పుడు ఫినాలే స్టేజ్ కి వచ్చింది.

రాబోయే బుధవారం ఈ ఫినాలే ఎపిపోడ్ టెలికాస్ట్ కావడానికి సర్వం సిద్ధం అయ్యింది. సీజన్ మొత్తం దుమ్ములేపే స్టెప్పులతో అదరగొట్టిన నైనికా, కావ్య, కార్తీక్, సాయి.. గ్రాండ్ ఫినాలేలోకి ఎంటర్ అయ్యారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్హున్ ఈ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్ రాబోతుండటంతో.., ఆయన చేతుల మీదగా వీరిలో ప్రైజ్ మనీ ఎవరు అందుకుంటున్నారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కానీ.., ఇలాంటి సమయంలో ఢీ-13 టైటిల్ విన్నర్ అనౌన్స్ మెంట్ వీడియో లీక్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

లీక్ అయిన ఈ వీడియోని గమనించినట్టయితే గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ కావ్య, కార్తీక్ మధ్యలో నిలబడి విన్నర్ ని అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని సెకన్ల తర్వాత బన్నీ కావ్య విన్నర్ గా నిలిచినట్టు ఆమె హ్యాండ్ ని పైకి లేపడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

Dhee 13 Kings vs Queens Winner Kavya - Suman TVకావ్య, ఆమె కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్ ఈ సీజన్ లో టైటిల్ విన్నర్ గా నిలవడానికి ప్రాణం పెట్టి పోరాడారు. ఈ క్రమంలోనే కావ్యకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సెట్ అయ్యింది. ఇలాంటి కావ్య టైటిల్ విన్నర్ గా నిలవడంతో నెటిజన్స్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ.., టెలికాస్ట్ కన్నా ముందే ఇలా వీడియో లీక్ కావడం దురదృష్టకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇకనైనా షో.. యాజమాన్యం ఇలాంటి లీక్ ల విషయంలో జాగ్రత్త వహిస్తుందేమో చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం ఈ లీక్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. కావ్య విజేతగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.