టి.ఆర్.ఎస్ ప్రభుత్వంపై అరియనా సీరియస్!

ఇటీవల కాలంలో సెలబ్రెటీలు తమదై కాంట్రవర్సీ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. చిన్న చిన్న విషయాలపై సీరియస్ గా స్పందిస్తూ.. మీడియాలో హడావుడి చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి యాంకర్ అరియానా చేరింది. యాంకర్ గా కెరీర్ ఆరంభించిన అరియానా తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. మొదటి నుంచి తనదైన దూకుడు ప్రదర్శిస్తూ చివరిదాకా ఆటలో నిలిచింది.

arifga min 1బిగ్ బాస్ లో పాల్గొన్న అరియానా కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది. ఆమెకు వరుస టీవీ షోలతో పాటు సినిమా అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 లో ఎలిమినేషన్ అయిన వారితో ఇంటర్వ్యూలు తీసుకుంటూ బిజీ గా మారింది. అయితే ఇండస్ట్రీ విషయంలో కానీ.. ఏ ఇతర విషయాల్లో కానీ అరియానా ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇటీవల రాంగోపాల్ వర్మతో తీసిన బోల్డ్ ఇంటర్వ్యూలో కూడా తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా కూల్ గా స్పందించింది.

fdagn minఅలాంటి అరియానా తాజాగా తెలంగాణ సర్కార్ పై మండి పడింది. మణికొండలోని రోడ్ల పరిస్థితి చాలా అధ్వన్నాంగా ఉన్నాయని.. ఇలాంటి రోడ్లపై ఆఫీసులకు వెళ్లే వారు.. షూటింగ్స్ వెళ్లే వారు.. ఇతర అర్జంట్ పనిమీద వెళ్లేవారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుందా.. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది.. ఇక్కడ కార్పోరేటర్ ఎందుకు పట్టించుకోవడం లేదని గట్టిగానే మాట్లాడింది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.