శంకర్‌పల్లి ఎమ్మార్వో ఆఫీసులో అల్లు అర్జున్‌.. ఫ్యాన్స్ హల్ చల్!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘గంగోత్రి’ చిత్రంతో తన ప్రస్ధానం మొదలు పెట్టిన అల్లు అర్జున్ తన డ్యాన్స్, ఫైట్స్, కామెడీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

allaurg minఇండస్ట్రీలో హీరోగా అల్లు అర్జున్ కి ఎంతగొప్ప పేరు ఉన్నా.. వ్యక్తిగతంగా చాలా సింపుల్ గా ఉంటారని అంటుంటారు. షూటింగ్ లేని సమయంలో తన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతుంటాడు అల్లు అర్జున్. దసరా పండుగ వచ్చిందంటే చాలు తన భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి వెళ్లి అక్కడి వారితో సందడి చేస్తుంటాడు. ఆ మద్య కాకినాడలో చిన్న హూటల్ కి వెళ్లి టిఫిన్ చేసిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.

asgasg minఎప్పుడూ సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా ఉండే అల్లు అర్జున్‌ రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి ఎమ్మార్వో ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలం జన్వాడలో అల్లు అర్జున్‌ రెండెకరాల భూమి కొనుగోలు చేశారు. ఆ భూమి రిజిస్ట్రేషన్‌ కోసం శుక్రవారం ఉదయం ఆయన శంకర్‌పల్లి తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. తమ అభిమాన హీరోని చూడగానే ఆఫీస్ సిబ్బంది తెగ సంబరపడిపోయారు. ఇక అల్లు అర్జున్ ని చూడటానికి జనాలు భారీ సంఖ్యలో ఎమ్మార్వో ఆఫీస్‌ వద్దకు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.