Kavali: రెక్కాడితే కానీ, డొక్కాడని కుటుంబం వారిది. ఓ పూట తినో.. ఓ పూట తినకో.. తమకంటూ ఉండటానికి ఓ సొంతిళ్లు ఉందన్న ధీమాతో బతుకుతున్నారు. ఆ ఇంటిపై రౌడీ మూకల కన్ను పడింది. పేద బతుకులపై దౌర్జన్యం మొదలుపెట్టాయి. ఆ ఇంటిని ఆక్రమించుకోవటానికి హింసించాయి.. దాడికి దిగాయి. దాడిలో గాయపడి, బాధితులు ఆసుపత్రి పాలైన సమయంలో ఇంటిని ఆక్రమించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్డీఓను ఆశ్రయించిన బాధిత కుటుంబం ఆయన కాళ్లపై పడి తమ బాధను చెప్పుకుంది. […]