హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై రాజకీయ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని విజయశాంతి మండిపడ్డారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు వసూలు చేస్తున్న ఫీజులపై ప్రభుత్వానికి ఏ మాత్రం నియంత్రణ లేదని ఆమె అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పీజులు కట్టలేక జనం అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించలేదా […]