వంతెనలు, కెనాల్స్, ప్రాజెక్టు లాంటి భారీ నిర్మాణలు చేపట్టినపుడు వాటి నాణ్యతా ప్రమాణాలు ఒకటికి పదిసార్లు చెక్ చేస్తుంటారు. పూర్తిగా సిద్దమైనపుడు దాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తారు. అయినా కూడా కొన్నిసార్లు చిన్న చిన్న లోపాలు జరగడం వల్ల ప్రాణాలు పోతుంటాయి.
ఈ మద్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీలు ఉన్నట్టుండి కూలిపోవడంతో కొన్నిసార్లు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. నిర్మాణ విలువలు సరిగా పాటించకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఏర్పాటు చేస్తున్న ఒక వంతెన్న ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఖగారియా, భాగల్‌పూర్ జిల్లాలను కలుపుతూ నాలుగు లైన్ల వంతెనను నిర్మిస్తున్నారు. ఇటీవల వచ్చిన పెను గాలులకు ఈ వంతెన కూలిపోవడం గమనార్హం. ఈ వంతెన ఖరీదు […]