తేలికపాటి, సమర్థమైన మిశ్రమ లోహాలు, కొత్త ఇంజిన్ డిజైన్‌లను అనేక కంపెనీలు రూపొందిస్తుండటంతో సూపర్‌సోనిక్ ప్రయాణికుల విమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అమెరికాకు చెందిన విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బూమ్ సూపర్‌సోనిక్ అనే అంకుర సంస్థ నుంచి 15 ‘ఓవర్‌ట్యూర్’ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇవి ప్రస్తుతం అత్యంత వేగంగా పయనించే ప్రయాణికుల జెట్‌ల కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళతాయి. ధ్వని కన్నా వేగంతో దూసుకెళ్లే ప్రయాణికుల విమానాలు భద్రత, నిర్వహణపరమైన ప్రమాణాలను అందుకోగానే […]