బంగారాన్ని కుదవపెట్టి, అప్పు తీసుకుంటున్న వారిలో బాకీలు తీర్చని కేసులు పెరుగుతున్నాయి. ప్రముఖ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా టన్ను బంగారాన్ని వేలం వేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విలువ దాదాపు రూ.404 కోట్లు. సాధారణంగా బ్యాంకుల్లో బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి ఏడాది కాలావధికి రుణాలు తీసుకుంటారు. గతేడాది లాక్‌డౌన్‌లు ముగిశాక, ఆర్థిక అవసరాల కోసం మూడో త్రైమాసికంలో పసిడి తనఖా రుణాలను ఎక్కువగా తీసుకున్నారని […]