సుదీర్ఘ విరామం తర్వాత టీటీడీ తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెట్లు జారీ చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభమైంది. రోజుకు 2 వేల సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించారు. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్లలో ఈ టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు దర్శనానికి అవకాశం […]