హైదరాబాద్- కరోనా ఆంక్షల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. భహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించకపోయినా, మాస్కులు ధరించకపోయినా ఫైన్లు విధిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో మాస్కులు ధరించని వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో మాస్కులు ధరించని వారిపై ఇప్పటి వరకు 3,39,412 కేసులు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఇక వీరందరి నుంచి వసూలు చేసిన ఫైన్ లు ఎంతో తెలుసా.. అక్షరాల 31 కోట్ల రూపాయలు. […]