గుంటూరు- సంక్రాంతి పండగ కోసం షాపింగ్ చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా, మిగతా వారు గల్లంతయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి సుందరరామిరెడ్డి చిన్న కుమారుడు మదన్ మోహనరెడ్డికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురును మాచర్ల మండలం కొత్తపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద వదిలిపెట్టారు. […]