భారత గానకోకిల లతా మంగేష్కర్.. శాశ్వతంగా కనుమూయడంతో సంగీత ప్రపంచం మూగబోయింది. కొన్ని దశాబ్దాలుగా లతా మంగేష్కర్ తన మధురమైన గాత్రంతో సినీలోకాన్ని, సంగీత ప్రియులను అలరిస్తూ వచ్చారు. నిన్నటితో ఆమె శకం ముగియడంతో.. ఆమె అభిమానులంతా బాధాతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు తెలియజేస్తున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడిన లతా మంగేష్కర్.. త్వరగా కోలుకోవాలని ప్రార్థించని వారులేరు. ఇక ఆమె మృతికి నివాళి అర్పిస్తూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. లతా మంగేష్కర్ సైకత శిల్పాన్ని […]