ఆంధ్రప్రదేశ్ లో సినీ ఫక్కీలో రైలు దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో గత అర్ధరాత్రి దోపిడీ దొంగలు కలకలం సృష్టించారు. పక్కా పథకం ప్రకారం దొంగలు రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను కత్తిరించారు. సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్‌లో ఆగిపోయింది. రైలు ఆగిపోవడంతో వెంటనే దొంగలు దాడులు మొదలు పెట్టారు. S5, S7 బోగీల్లో ఉన్న వారిని మారణాయుధాలతో చంపేస్తామని బెదిరించి నగదు, బంగారు […]