పువ్వుపుట్టగానే పరిమళిస్తుందని అంటారు .కొందరు పిల్లలు ఒక్కో విషయంలో అద్భుతమైన ప్రజ్ఞ పాటవాలను ప్రదర్శిస్తుంటారు .కొందరు సంగీతంలోను కొందరు సాహిత్యంలోను కొందరు శాస్త్ర సంబంధమైన అంశాలలో విశేషమైన ప్రతిభని కనబరుస్తుంటారు.తల్లితండ్రుల ప్రభావం కొంతవరకు ఉన్నా ఒక్కొక్కరు స్వయం ప్రతిభతో రాణిస్తూ ఉంటారు.చిన్నతనంలో పిల్లలకి చెప్పిన చందమామ కథలు కావచ్చు మరో కథలు కావచ్చు. ఇలాంటివి చిన్నతనంలో వినటం వలన వారిలో ఉత్సాహం ఆసక్తి కలిగే అవకాశం ఉంది. ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల గురించి పెద్దవాళ్లు కథలుగా చెబుతుంటే […]