ఫిల్మ్ డెస్క్- సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా కాలేయ వ్యాదితో బాధ పడుతున్న రమేష్ బాబు ఆరోగ్యం శనివారం మరింత క్షీణించడంతో, గచ్చిబౌళిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే రమేష్ బాబు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కృష్ణ ఇంట్లో విషాదం నెలకొంది. అల్లూరి సీతారామరాజు చిత్రంలో రమేష్ బాబు యువ అల్లూరి పాత్రలో కనిపించి సినీ రంగ ప్రవేశం చేశారు. […]