ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న రోవ్‌మన్ పావెల్.. జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. చిన్నతనం నుంచి తల్లి కష్టంతో కడుపేదరికంలో బతికిన పావెల్.. చాలా చిన్న వయసులోనే ఈ పేదరికం నుంచి తన కుటుంబాన్ని బయటపడేస్తానని తల్లికి మాట ఇచ్చాడు. చదువు లేదా క్రికెట్‌తోనే తమ జీవితాలు మారుతాయని బలంగా విశ్వసించిన పావెల్.. రెండింటిపై శ్రద్ధపెట్టాడు. క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో క్రికెట్‌నే కెరీర్‌గా మల్చుకున్నాడు. వెస్టిండీస్ […]