ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో గెలిచింది. కాగా ఈ మ్యాచ్‌తో ఆరేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబ్ బౌలర్ రిషి ధావన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2016లో పంజాబ్ తరఫున చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రిషి ధావన్ ఇన్నాళ్లకు మళ్లీ అవకాశం అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రిషి ధావన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. […]