న్యూ ఢీల్లీ- భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై బీజేపీ సర్కార్ వెనక్కి తగ్గింది. మోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై సుమారు యేడాదిన్నర కాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండు చేస్తూ వస్తున్నారు. ఆ మేరకు చాలా కాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రైతుల డిమాండ్ ను, వ్యవసాయ చట్టాలపై పెరుగుతున్న వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి […]