ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు గిత్తలకు మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అంతటి పేరు, గుర్తింపును సాధించినవి పుంగనూరు ఆవులని చెప్పొచ్చు. ఈ ఆవు జాతి మొత్తం చిత్తూరు జిల్లాకే దేశవ్యాప్తంగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తెనాలిలో ఓ పుంగనూరు ఆవు దేశవ్యాప్తంగా మరోసారి వాటి జాతి పేరు మారుమ్రోగేలా చేసింది. పొట్టిగా మూడడుగుల ఎత్తులో చూడగానే ఆకట్టుకునేలా ఉండే ఈ ఆవులను.. పాలు తక్కువ ఇస్తాయనే కారణంతో మొదట్లో […]