మనిషికి అసహనం, ఆగ్రహం ఎక్కువైపోతే వస్తువులు బద్దలైపోతాయనడానికి ఈ శ్రీకాకుళం వ్యక్తే నిదర్శనం. ఇతగాడి అసహనం, ఆగ్రహం టన్నుల్లెక్కన ఉందేమో ఏకంగా ఏటీఎం మెషిన్ మీద తన ప్రతాపం చూపించాడు. ఏటీఎం నుంచి డబ్బులు రాలేదన్న కోపంతో ఏకంగా ఏటీఎం మెషిన్ నే ధ్వంసం చేశాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ మండలానికి చెందిన పైడి సత్యనారాయణ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు సోమవారం పొందూరు […]