గూడ కొంగకు అరుదైన గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సు అంబాసిడర్‌గా గూడకొంగ (పెలికాన్) ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంగజాతుల్లో 40 శాతానికి పైగా గూడకొంగలు కొల్లేరులోనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొల్లేరుకు ప్రతి ఏటా దేశవిదేశాల నుంచి అనేక రకాల పక్షులు వలసొచ్చి సందర్శకులకు కనువిందు చేస్తుంటాయి. ఒకప్పుడు ఇక్కడ స్వచ్ఛమైన నీరు ఉన్నా.. ప్రస్తుతం పలు ఆక్రమణలకు గురైంది.. కానీ పక్షుల రాక మాత్రం తగ్గలేదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో […]