పన్నుల కట్టాల్సిన పనిలేని దేశాల్లో నకిలీ కంపెనీలను సృష్టించి తన నల్లధనాన్ని పొగేసుకున్న వారి వివరాలు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) ఆదివారం బహిర్గతం చేసింది. వీరిలో భారతదేశానికి చెందిన బడా బాబులు ఉండడం గమనార్హం. 12 మిలియన్ల పత్రాలను తాము సేకరించినట్లు ఐసీఐజే వెల్లడించింది. పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ […]