తిరుపతి- తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం సరికొత్త ప్రడక్ట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. నమామి గోవింద బ్రాండ్ పేరుతో పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులను భక్తులకు అందుబాటులో తీసుకొస్తున్నట్లు టీటీడీ ఈఓ కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. తిరుపతిలోని డీపీడబ్ల్యూ స్టోర్ లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు పంచగవ్యాలతో పలు […]