పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన భార్య బుష్రా బీబీతో చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే వివాహబంధం విషయంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ కుమారుడు ముహమ్మద్ మూసా మనేకా మద్యం కేసులో మూటగట్టుకున్నారు. బుష్రా బీబీ చిన్న కుమారుడిపై పాకిస్థాన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బుష్రా బీబీ కొడుకుతో పాటు అతని బంధువు, స్నేహితుడిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కారులో మద్యం ఉంచినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. […]