పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ఇక అమ్మాయి, అబ్బాయి కుటుంబాల నేపథ్యం, వారి ఆస్తిపాస్తులు వంటి వివరాలు తెలుసుకుని.. నెలకు ఎంత సంపాదించగలడో కన్నుకుని.. ఆ తర్వాత ఇద్దరి జాతకాలు చూసి.. అవి కూడా కుదిరితేనే.. అప్పుడు పెళ్లి బాజాలు మోగుతాయి. వివాహం అంటే ఇంత పెద్ద తతంగం. ఇక కట్నకానుకల సంగతి గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తున్నా సరే.. బోలేడు కట్నం ఇచ్చి […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రుతీ హాసన్ నటించిన శ్రీమంతుడు చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా కాన్సెప్ట్ ఎంత బాగా క్లిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా స్ఫూర్తిగా తీసుకుని.. చాలా మంది కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. చాలా మంది ఎన్నారైలు తమ స్వగ్రామాంంలో మంచి పనులు చేపట్టారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తెలంగాణ, నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. […]
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ దగ్గర గంగానదిలో చంటిబిడ్డ కొట్టుకువచ్చిన సంచలన ఘటన బుధవారం జరిగింది. గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తుండటంతో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. చుట్టూ చూశాడు. ఎక్కడా బిడ్డ జాడలేదు. కానీ ఏడుపులు మాత్రం వినిపిస్తున్నాయి. దీంతో తీవ్రంగా పరిశీలించి చూడగా నదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకువస్తుండటం చూశాడు. ఆ పెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తున్నాయని తెలుసుకున్నాడు. నదిలోంచి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకొచ్చి తెరిచి చూడగా అందులో […]