‘మూడు టెస్టులు, మూడు వన్డేలు సిరీస్ కోసం భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇరుజట్లు 1-1 తో గెలిచి సమంగా ఉన్నాయి. అయితే కేప్ టౌన్ లో జరగనున్న మూడో టెస్టు విజయంపై అటు సౌతాఫ్రికా, ఇటు టీమిండియా ఎంతో ధీమాగా ఉన్నాయి. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుంటే, స్వదేశంలో భారత్‌పై తమకున్న రికార్డును పదిలంగానే ఉంచాలని […]