వైసీపీ పార్టీ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి బుధవారం నాడు కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను విభేదించి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రమణారెడ్డి రాయలసీమ విమోచన సమితిని ఏర్పాటు చేశారు. సీమ హక్కుల కోసం పోరాడారు. 1983లో ఎంవీ రమణారెడ్డి ఎమ్మెల్యేగా […]