రుణం పొందిన నెల రోజుల్లో కారు తాలూకు పత్రాలు అందజేయాలని ముత్తూట్ షరతు విధించింది. డబ్బులు చేతికి రాగానే సాకేత్ వాటిని సొంతానికి వాడుకున్నాడు. కారుకు సంబంధించిన పత్రాలను సంస్థకు అందచేయలేదు. 15నెలల పాటు వాయిదాలు సరిగ్గానే కట్టాడు. ఆ తరువాత నుంచి కట్టడం మానేశాడు. దీంతో ముత్తూట్ నిర్వాహకులు వాకబు చేయగా అసలు ఆయన కారే కొనుగోలు చేయలేదని తేలింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. సాకేత్ ఉద్దేశపూర్వకంగా తమను మోసం చేశారని […]