తిరుపతి- టాలీవుడ్ సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మోహన్ బాబు తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు కన్ను మూశారు. గత కొంత కాలంగా రంగస్వామి నాయుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో గుండె పోటుకు గురైన ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సోదరుడి మరణంతో మోహన్ బాబు కుటుంబం, బంధు మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సోదరుడిని […]