తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కాస్త హీటెక్కాయి. ఇక మా అధ్యక్ష రేసులో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు సినీ ప్రముఖులను కలుస్తూ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. కాగా ముందుగా పోటీలో ఉన్న జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహన్ వంటి ప్రముఖులు నిష్క్రమించటంతో పోటీ ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు మధ్య నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోటీ వీరిద్దరి మధ్యే ఉండటంతో మరింత ఆసక్తిగా మారింది. […]
ఈ సారి మా ఎన్నికలు కాస్త రసవత్తర పోరుకు తలపిస్తున్నాయి. గత మా ఎన్నికలను మించి కొత్తగా మారబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటకే పోటీలో చాలా మందే ఉన్నారు. ఇక ప్రత్యక్ష ఎన్నికలను మించిపోతున్న ఈ ఎన్నికల్లో ఇప్పుడే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మా ఎన్నికలకు ఇంకా చాల కాలమే ఉన్నా..పోటీకి మాత్రం ఇప్పటి నుంచే కాలు దువ్వుతున్నారు పోటీదారులు. మొదట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రకాష్ రాజ్ ప్రకటించారు. వెనువెంటనే […]