చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళీ నటుడు కుమరకోమ్ వాసుదేవన్ గురువారం(ఏప్రిల్ 14న) కన్నుమూశారు. 76 ఏళ్ల వయసు కలిగిన వాసుదేవన్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు కారణంగా ఇటీవల కొట్టాయంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు మలయాళ సినీవర్గాల సమాచారం. ఇక వాసుదేవన్ 2015లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒట్టాల్’లో కీలకపాత్ర పోషించి నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. మీడియా కథనాల ప్రకారం.. వాసుదేవన్ కి […]