హైదరాబాద్- తెలంగాణలో జరిగిన మినీ మునిసిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ అన్నింట్లో గెలుపొందింది. మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 […]