ఏపీలో గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో ఎయిర్పోర్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలతో రాయలసీమ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒక బాధ్యత గల హోదాలో ఉండి సోమువీర్రాజు అలా వ్యాఖ్యానించడంపై పెద్ద ఎత్తున రాయలసీమ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోము వీర్రాజు వివరణ ఇచ్చే ప్రయత్నం […]