ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ హిందీ నటుడు జితేంద్ర శాస్త్రి కన్నుమూశారు. శుక్రవారం ఆయన మరణించినట్లు సమాచారం. అయితే, ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. జితేంద్ర మరణంపై అతడి సహచర నటులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో వార్త వెలుగులోకి వచ్చింది. నటుడు జితేంద్ర శాస్త్రి బ్లాక్ ఫ్రైడే, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, రాజ్మా చావ్లా సినిమాల్లో నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఓటీటీలో దుమ్మరేపిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లోనూ జితేంద్ర నటించారు. ఉస్మాన్ అనే […]