అమరావతి- కరోనా రోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా పేషెంట్లకు ఆరోగ్యశ్రీ పధకం క్రింద చికిత్స అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కోవిడ్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ పై సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎంప్యానెల్ చేసిన […]