హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ధర్మాసనం అసంతృప్తి చెందింది. ఈ రోజు రాత్రితో కర్ఫ్యూ ముగుస్తున్నా తదుపరి చర్యలు ప్రకటించకపోవడంపై కోర్టు మండిపడింది. కరోనా కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో 45 నిమిషాల్లో చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వం విధుల్లో జోక్యం చేసుకోవాలన్నది తమ […]