అనాదిగా మహిళలను చిన్న చూపు చూస్తున్న సమాజం మనది. అంతరిక్షంలోకి వెళ్తున్నప్పటికి.. అతివల పట్ల సమాజ ధోరణిలో ఏ మాత్రం మార్పు లేదు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అని గొప్పగా చెప్పుకుంటాం కానీ.. ఆచరణలో మాత్రం వారికి వీసమెత్తు గౌరవం ఇవ్వం. ఆమె ఆశలు, ఆశయాల్ని కట్టడి చేస్తాం. ఎదగడానికి ప్రయత్నించిన ప్రతి సారి ఆమె రెక్కలను బలంగా దెబ్బ కొడతాం. కుదరకపోతే ఆమె ఆత్మ గౌరవం, పరువు ప్రతిష్టలను బజారు పాలు చేసి ఆనందిస్తాం. […]