ఉమెన్స్ మ్యాచ్ ఏం చూస్తావు.. రా! ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్లు 200 కొడతారు.. అక్కడితో మ్యాచ్ వన్ సైడ్. ఇది తొలి రెండు మ్యాచులు ముగిశాక అందరి నోటి నుంచి వచ్చిన మాటలు. కానీ, మూడో మ్యాచ్ అందుకు తెరదించింది. విజయం సాధించాలంటే ఆఖరి 18 బంతుల్లో 53 పరుగులు కావాలి.. చేతిలో ఉన్నవి మూడే వికెట్లు.. ఈ దశలో యూపీ వారియర్స్ నిజంగానే పేరుకు తగ్గ ప్రదర్శన చేసింది. బిగ్‌బాష్ స్టార్ గ్రేస్ హ్యారిస్ (26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 నాటౌట్) అసాధారణ రీతిలో చెలరేగి మ్యాచ్ యూపీ వశం చేసింది.