5జీ కోసం ఎదురుచూస్తున్న టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఇటీవలే 5జీ ట్రయల్స్‌కు అనుమతిచ్చిన టెలికాం విభాగం (డాట్).. తాజాగా అందుకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలకు కేటాయించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ నగరాల్లో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో 700 మెగా హెడ్జ్ బ్యాండ్, 3.3-3.6 గిగాహెడ్జ్ బ్యాండ్, 24.25-28.5 గిగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయించినట్టు […]