మూఢనమ్మకాలు దేశమంతటా ఉన్నాయి. దేశమంతా మూఢనమ్మకాల నిరోధకచట్టం రావలసిన అవసరం ఉంది. చేతబడులు, పూనకాలు, గుప్తనిధులు, లంకెబిందెలు, నరబలులు అంటూ మోసంచేసే వాళ్లూ ఎక్కువయ్యారు. వీటన్నింటికి విరుగుడు ఒక్కటే ‘మూఢనమ్మకాల నిరోధక చట్టం’ తెచ్చేందుకు హేతువాదులు, నాస్తికులు, అభ్యుదయవాదులు, ఉద్యమించాలి.ప్రజల అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని మంత్రాల పేరిట డబ్బు దోచుకుంటున్న ఓ ముఠాను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ఈ ముఠా సభ్యులు ఓ వ్యక్తిని నమ్మించి ఏకంగా రూ.62.5 లక్షలను ఎత్తుకెళ్లారు. రెండేళ్లుగా తప్పించుకుని […]