కరోనా పరీక్షల్లో జరుగుతున్న దోపిడీ. పలు ప్రైవేటు వైద్యశాలలు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక పక్క మహమ్మారి బారిన పడి అల్లాడుతున్న పేషెంట్లు మరో దిక్కులేక వారు అడిగినంత సమర్పించుకుని రిపోర్టులతో బయట పడుతున్నారు. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు లేకపోవడంతోనే జనం ప్రైవేటుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఉన్నదే దోచుకునేందుకు అన్నచందంగా తయారయ్యాయి. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం వెళ్తే […]