నగర వాసులకు గుడ్ న్యూస్. ఒకప్పుడు సిటీ రోడ్లపై రయ్ రయ్ మంటూ పరుగులు తీసిన డబుల్ డెక్కర్ బస్సులు, మరోసారి భాగ్యనగరం రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఈనెల 11 నుంచి ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ ప్రాంతాల్లో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం హెచ్‌ఎండీఏ ఆర్డర్ ఇవ్వగా ప్రస్తుతం 3 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సులను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. […]