సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మక ఇచ్చే అస్కార్ అవార్డు ఫంక్షన్ ఈ నెల 13 న లాస్ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరగబోతుంది. ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలని అంటారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ అవార్డుల రేసులో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ కోసం పోటీపడుతుంది.