క్రికెట్ అనగానే మైదానంలో ఆటగాళ్లు పంచే వినోదం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కోసారి అనుకోని అతిథులుగా మైదానంలో అడుగుపెట్టే పక్షులు, జంతువులు చేసే సందడి మాములుగా ఉండదు. ఐర్లాండ్ దేశవాళీ క్రికెట్‌లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అకస్మాత్తుగా గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన ఓ బుజ్జి కుక్క బంతిని ఎత్తుకెళ్లి ఫీల్డర్లను మైదానమంతా పరుగులు పెట్టించింది. అసలే వర్షం వల్ల 20 ఓవర్ల మ్యాచ్ 12 ఓవర్లకు కుదించారు. ఈ కుక్క ఎంట్రీతో మ్యాచ్ మళ్లీ అంతరాయానికి గురైంది. […]