ప్రభుత్వ కేంద్రాల్లో కొవిడ్ టెస్టులను తగ్గించడంతో ప్రజలు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా జిల్లాల్లోని ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలు దోచుకుంటున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా యథేచ్ఛగా ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ టెస్టులు చేసేస్తున్నాయి. రోగికి రిపోర్టు ఇవ్వకుండా ‘పాజిటివ్/ నెగెటివ్’ అని మౌఖికంగా చెప్పేస్తున్నాయి. నమూనాలు తీసుకోకుండానే కోరుకున్న మేరకు కొవిడ్ పాజిటివ్, నెగెటివ్ రిపోర్టులు జారీ చేస్తున్న ఓ డయాగ్నస్టిక్ సెంటర్ ఉదంతం పాతబస్తీ చాంద్రాయణగుట్టలో బయటపడింది. విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు శుక్రవారం […]